News November 24, 2024

రచిన్ రవీంద్రను తిరిగి దక్కించుకున్న చెన్నై

image

ఓపెనింగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను CSK రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.1.50 కోట్లతో వేలంలోకి వచ్చిన ఇతడి కోసం పంజాబ్, చెన్నై పోటీ పడ్డాయి. గత సీజన్లో చెన్నై తరఫున ఆడిన ఇతను 161 స్ట్రైక్ రేట్‌తో 222 పరుగులు చేశారు.

Similar News

News December 11, 2024

విశ్వక్, అనుదీప్ కొత్త మూవీ ‘ఫంకీ’

image

విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్‌లో ‘ఫంకీ’ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. నాగవంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తారు. కాగా విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

News December 11, 2024

మోహన్‌ బాబును అరెస్ట్ చేయాలి: బీజేపీ ఎంపీ

image

TG: మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు పొందిన వ్యక్తి నిన్న వ్యవహరించిన తీరు దారుణమని మండిపడ్డారు. మరోవైపు జర్నలిస్టుపై మోహన్ బాబు దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తప్పుబట్టారు. జర్నలిస్టు సమాజానికి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.

News December 11, 2024

‘అఖండ2’ నుంచి సాయంత్రం బిగ్ అప్డేట్

image

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ2’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇవాళ సాయంత్రం 5.31 గంటలకు రోరింగ్ అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తారు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ పూజా కార్యక్రమం జరుగుతుందని టాక్.