News March 23, 2024
బోణి కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ జట్టు 174 పరుగుల టార్గెట్‌ను 18.4 ఓవర్లలోనే చేధించింది. జట్టులో రచిన్ రవీంద్ర (37), అజింక్య రహానే (27) రాణించారు. చివర్లో శివమ్ దూబే (34), రవీంద్ర జడేజా (25) మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు విజయ తీరాలకు చేరింది. బెంగళూరు బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీశారు.
Similar News
News September 18, 2024
పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం
AP: పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.
News September 18, 2024
ఆ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు: రంగనాథ్
TG: బుల్డోజర్లతో నేరస్థులు, నిందితుల ఇళ్లను కూల్చడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన <<14124312>>ఆదేశాలు<<>> ‘హైడ్రా’కు వర్తించవని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి ‘హైడ్రా’ వెళ్లడం లేదన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు.
News September 18, 2024
వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త యూనిఫామ్
AP: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా చర్యలు తీసుకోనుంది.