News November 20, 2024
మణిపుర్ అగ్నికి వాయువు జోడించిన చిదంబరం
‘ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే ఒకే రాష్ట్రంలో మైతేయ్, నాగా, కుకీలు కలిసి బతుకుతారని’ మణిపుర్‌పై మాజీ HM చిదంబరం చేసిన ట్వీట్ పాత గాయాల్ని రేపినట్టైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వినతి మేరకు ఆ ట్వీట్‌ను తొలగించారు. ప్రశాంతత నెలకొన్న రాష్ట్రంలో మంటలు చెలరేగడానికి చిదంబరమే కారణమని CM బిరేన్ సింగ్ ఆరోపించారు. గతంలో మయన్మార్ విద్రోహ శక్తులతో చేతులు కలిపారంటూ ఆయన ఫొటోను బయటపెట్టారు.
Similar News
News November 20, 2024
ICC ర్యాంకింగ్స్‌లో టాప్-3కి తిలక్ వర్మ
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ICC T20I ర్యాంకింగ్స్‌లో రయ్యుమని దూసుకెళ్లారు. ఒకేసారి ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్3కి చేరుకున్నారు. టాప్1లో ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) ఉండగా 2వ స్థానంలో సాల్ట్(ఇంగ్లండ్) ఉండగా ఆ తర్వాతి స్థానాన్ని తిలక్ కైవసం చేసుకున్నారు. అరంగేట్రం తర్వాత కేవలం 20 మ్యాచుల్లో తిలక్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. ఇటీవల SAపై వరుస సెంచరీలు చేసిన వర్మ మొత్తం 51.33 సగటుతో 616 రన్స్ చేశారు.
News November 20, 2024
భారత్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు మెస్సీ?
2025లో కేరళతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ 2 మ్యాచ్‌లు ఆడుతుందని ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఇందులో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కూడా ఆడతారని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కేరళలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ ఎక్కువ. భారత్‌లో ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడే కొన్ని రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. మెస్సీ చివరిగా 2011లో ఇండియాలో ఆడారు.
News November 20, 2024
థియేటర్లలోకి వారికి నో ఎంట్రీ!
యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిల్మ్ క్రిటిక్‌లపై తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లలోకి వారిని అనుమతించకూడదని యాజమాన్యాలను కోరింది. రివ్యూల పేరుతో నటీనటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండటంతో TFPC ఈ నిర్ణయం తీసుకుంది. వీరి రివ్యూలు వేట్టయన్, ఇండియన్ 2, కంగువా చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది.