News November 20, 2024

మణిపుర్ అగ్నికి వాయువు జోడించిన చిదంబరం

image

‘ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే ఒకే రాష్ట్రంలో మైతేయ్, నాగా, కుకీలు కలిసి బతుకుతారని’ మణిపుర్‌పై మాజీ HM చిదంబరం చేసిన ట్వీట్ పాత గాయాల్ని రేపినట్టైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వినతి మేరకు ఆ ట్వీట్‌ను తొలగించారు. ప్రశాంతత నెలకొన్న రాష్ట్రంలో మంటలు చెలరేగడానికి చిదంబరమే కారణమని CM బిరేన్ సింగ్ ఆరోపించారు. గతంలో మయన్మార్ విద్రోహ శక్తులతో చేతులు కలిపారంటూ ఆయన ఫొటోను బయటపెట్టారు.

Similar News

News April 16, 2026

NTR ‘డ్రాగన్’ మూవీ ఈ ఏడాది రిలీజయ్యేనా?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా విడుదలపై ఓ షాకింగ్ వార్త వైరలవుతోంది. ఈ ఏడాది జూన్‌లో సినిమా వస్తుందని గతంలో ప్రకటించగా.. షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండటంతో అది సాధ్యం కాదని సినీవర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కావచ్చని తెలిపాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ‘డ్రాగన్’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి.

News April 16, 2026

ఒక్క మిస్సైల్‌తో.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

image

హార్ముజ్ జలసంధిపై పట్టు కోసం ప్రయత్నిస్తే అమెరికా నౌకలను మిస్సైల్స్‌తో కూల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ మొదటి మిస్సైల్ దాడికే US యుద్ధ నౌకలు సముద్రంలో మునిగిపోతాయని ఇరాన్ సుప్రీం నేత సలహాదారు మోహ్‌సేన్ రెజాయి అన్నారు. ఒకవేళ అమెరికా గ్రౌండ్ అటాక్‌కు దిగితే ఆ దేశ సైనికులను బందీలుగా పట్టుకుంటామన్నారు. ఒక్కో సైనికుడిని విడిపించేందుకు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

News April 16, 2026

‘నీ భార్యను నా దగ్గరికి పంపు’.. ‘TCS’ కేసులో షాకింగ్ విషయాలు

image

TCS నాసిక్ బ్రాంచ్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల <<19633913>>కేసు<<>>లో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. తన టీమ్ లీడర్లు తనతో బలవంతంగా నమాజ్ చేయించారని, స్కల్ క్యాప్ ధరింపజేశారని ఓ మేల్ ఎంప్లాయీ ఆరోపించారు ‘పిల్లలు కావాలంటే నీ భార్యను నా దగ్గరికి పంపు’ అంటూ నిందితుడు తౌసిఫ్ అక్తర్ అసభ్యంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు.