News December 7, 2024
చైల్డ్ కేర్ లీవ్స్ 730 రోజులు ఇవ్వాలి: ఏపీజేఏసీ అమరావతి
AP: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం తరహాలో 730 రోజులు చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేయాలని APJAC అమరావతి డిమాండ్ చేసింది. ప్రస్తుతం 180 రోజులే ఇస్తున్నారని తెలిపింది. పెన్షనర్ చనిపోతే భాగస్వామికి, ఇరువురూ మరణిస్తే వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలకు పెన్షన్ ఇవ్వాలని కోరింది. 3 నెలలకోసారి ఉద్యోగులతో సమావేశమై సమస్యలను పరిష్కరించాలంది. ఈ మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది.
Similar News
News January 13, 2025
రష్యాపై US ఆంక్షలు.. భారత్, చైనాపై ప్రభావం!
రష్యా చమురు పరిశ్రమపై US విధించిన తాజా ఆంక్షలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. 2022 నుంచి చౌకగా లభిస్తున్న రష్యా చమురుకు ప్రధాన దిగుమతిదారులుగా ఉన్న భారత్, చైనాలకు ఈ ఆంక్షలు ప్రతికూలంగా పరిణమించాయి. చైనా షాన్‌డాంగ్‌లోని స్వతంత్ర చమురు సంస్థలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. భారత్ అవసరాల్లో మూడోవంతు రష్యా నుంచే వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తోంది.
News January 13, 2025
Thank You పవన్ కళ్యాణ్: YCP
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ థాంక్స్ చెప్పింది. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ ఆయన తమకు స్టార్ క్యాంపెయినర్‌గా మారారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. స్కూళ్లు, కర్నూలులో గ్రీన్‌కో సోలార్ ప్రాజెక్టు, పంప్ స్టోరేజ్, విశాఖలో రుషికొండ భవనాల వద్ద ఆయన ఫొటోలను షేర్ చేసింది. కాగా తమ ప్రభుత్వంలో పూర్తిచేసిన కార్యక్రమాలపై వైసీపీ ఇవాళ్టి నుంచి క్యాంపెయిన్ ప్రారంభించింది.
News January 13, 2025
మరోసారి తగ్గనున్న మద్యం ధరలు!
APలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మాన్షన్ హౌస్, అరిస్ట్రోకాట్ ప్రీమియం, కింగ్ ఫిషర్ వంటివి ధరలు తగ్గించుకోగా, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ధరల తగ్గింపునకు ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.