News February 11, 2025
ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

AP: అల్లూరి(D) మారేడుమిల్లి(M) తాడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. <<15414061>>ఆల్బెండజోల్ ట్యాబ్లెట్<<>>(నులిపురుగుల నివారణ మాత్ర) వికటించి నాలుగేళ్ల చిన్నారి రస్మిత కన్నుమూసింది. అన్నం తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకున్న బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News March 28, 2025
రేపు సూర్యగ్రహణం

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది.
News March 28, 2025
500 మంది భారతీయ ఖైదీలకు UAE క్షమాభిక్ష

రంజాన్ పండుగ వేళ 2813 మంది ఖైదీలకు UAE ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. మరోవైపు ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 1518 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. వీరిలో 500 మందికి పైగా భారతీయులు ఉండటం గమనార్హం. ఇది ఇండియా-UAE మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
News March 28, 2025
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో ఉద్యోగులు ఫెయిల్!

ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయంలో సంతృప్తిగా లేనట్లు ‘జీనియస్ కన్సల్టెంట్స్’ సర్వేలో తేలింది. పని వేళల వల్ల రెండింటినీ మేనేజ్ చేయలేకపోతున్నామని 52% మంది అభిప్రాయపడ్డారు. ప్రతి ముగ్గురిలో ఒక్కరే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. పనికి తగ్గ వేతనాలు కంపెనీ చెల్లించట్లేదని 68% మంది భావిస్తున్నారు. మెంటల్ హెల్త్, శ్రేయస్సు గురించి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే సంతోషపడతామని 89% మంది చెప్పారు.