News October 1, 2024
4 నెలల వయసులో చిన్నారికి పెళ్లి.. 20 ఏళ్లకు రద్దు
తన బాల్య వివాహానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఓ యువతి విజయం సాధించారు. 2004లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 4 నెలల చిన్నారి అనితకు పేరెంట్స్ పెళ్లి చేశారు. ఇప్పుడు కాపురానికి రావాలంటూ అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె 20 ఏళ్ల వయసులో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా, ఆ పెళ్లిని రద్దు చేసి, కోర్టు ఖర్చులను చెల్లించాలని అత్తమామలను ఆదేశించింది. బాల్య వివాహాలు దుర్మార్గం, నేరమని వ్యాఖ్యానించింది.
Similar News
News October 15, 2024
వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874: నాబార్డు
TG: రాష్ట్రంలో 55% మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు నాబార్డు తెలిపింది. మిగతా 45% శాతం కుటుంబాలు వ్యవసాయేతర పనులు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు సగటున 2 ఎకరాల భూమి ఉందని తెలిపింది. వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874 ఉండగా, నెలవారీ ఖర్చు రూ.13,093గా ఉంది. తగినంత ఆదాయం లేకపోవడంతో తమ భూములను కౌలుకు ఇచ్చి, ఉద్యోగాలు చేసుకుంటున్నాయని వెల్లడించింది.
News October 15, 2024
అకౌంట్‌లోకి రూ.16 లక్షలు.. తిరిగి ఇవ్వనందుకు జైలు శిక్ష
భారత్‌కు చెందిన పెరియసామీ మథియాళగన్‌కు సింగపూర్‌లో 9 వారాల జైలు శిక్ష పడింది. పొరపాటున తన ఖాతాలోకి వచ్చిన డబ్బులు తిరిగివ్వనందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. ఓ మహిళ తాను పనిచేసే సంస్థలో లోన్ తీసుకుని, తిరిగి చెల్లించే క్రమంలో అతని అకౌంట్‌కు పంపింది. ఆ డబ్బు తనది కాదని తెలిసినా అతను తన అప్పులు తీర్చి, కుటుంబానికీ కొంత పంపాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు.
News October 15, 2024
కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌లు
TG: DSC ద్వారా టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి విద్యాశాఖ ఇవాళ పోస్టింగ్‌లు ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా జిల్లాల్లో స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఉ.9:30 నుంచి స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులకు, మ.12.30 నుంచి SGTలకు కౌన్సెలింగ్ జరుగుతుంది. నేడు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి మిగిలిపోయిన ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వనుంది. మొత్తం 11,062 ఖాళీలుండగా 10,006 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.