News August 9, 2024
పిల్లలూ.. మీ మనీశ్ అంకుల్ తిరిగి వచ్చేస్తున్నారు: రాఘవ్ చద్దా
ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ దక్కడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ రాఘవ్ చద్దా స్పందిస్తూ ‘ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో దేశం మొత్తం సంతోషంగా ఉంది. పేద పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడమే ఆయన చేసిన నేరం. పిల్లలూ.. మీ మనీశ్ అంకుల్ తిరిగి వచ్చేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.
Similar News
News September 20, 2024
కూటమి పాలనకు 100 రోజులు.. ‘ఇది మంచి ప్రభుత్వమేనా?’
AP: కూటమి పాలనకు నేటితో 100 రోజులు పూర్తవడంతో 26వ తేదీ వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో MLAలు క్యాంపెయిన్ చేయనున్నారు. పెన్షన్ల పెంపు, మెగా DSC, అన్న క్యాంటీన్లు, అమరావతి, పోలవరానికి నిధులు, ‘ల్యాండ్ టైటిలింగ్’ రద్దు తదితర 100 కార్యక్రమాలు చేశామని నేతలు చెబుతున్నారు. ‘సూపర్-6’ ఊసు లేదని, ప్రత్యర్థులపై దాడులు, హత్యలు తప్ప చేసిందేమీ లేదని YCP విమర్శిస్తోంది. మీరేమంటారు? ఇది మంచి ప్రభుత్వమేనా?
News September 20, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.500 కోట్లు?
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందన్న ఆరోపణల వేళ కేంద్రం ఈ ఫ్యాక్టరీకి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ నిధులతో జీఎస్టీ, ఉద్యోగ భవిష్య నిధి, ప్రభుత్వ లెవీలు వంటి చట్టబద్ధమైన చెల్లింపులు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. చెల్లింపుల నిర్వహణను SBIకి అప్పగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర అంశాలకు వినియోగిస్తే వెంటనే నిలిపేయాలని సూచించినట్లు పేర్కొంటున్నాయి.
News September 20, 2024
ENGvsAUS: హెడ్ విధ్వంసం.. ఆసీస్ ఘన విజయం
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యాన్ని 44 ఓవర్లలోనే ఛేదించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న ట్రావిస్ హెడ్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 129 బంతుల్లో అజేయంగా 154 రన్స్(20 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2011లో వాట్సన్ 161* రన్స్ చేశారు.