News March 17, 2024

పాకిస్థాన్‌కు చైనా నిఘా నౌక!

image

పాకిస్థాన్ నౌకాదళంలో తొలిసారిగా ఓ నిఘా నౌక చేరింది. భారత్‌పై కన్నేసి ఉంచేందుకు చైనా ఈ నౌకను అందించింది. అణు వార్‌హెడ్‌లు ఉన్న బాలిస్టిక్ క్షిపణుల్ని గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ నౌకను పాక్ ‘పీఎన్ఎస్ రిజ్వాన్’గా పిలుస్తోంది. చైనాలోని ఫుజియాన్ మావై షిప్ బిల్డింగ్ సంస్థ నిర్మించింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, భారత్‌ వద్ద మాత్రమే ఈ తరహా నిఘా నౌకలు ఉండగా పాక్ వాటి సరసన చేరింది.

Similar News

News April 4, 2025

పిఠాపురంలో నాగబాబు పర్యటన.. TDP, JSP బలప్రదర్శన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్సీ నాగబాబు ఇవాళ పలు అభివృద్ధి పనులను ప్రారంభించగా దీనికి స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ దూరంగా ఉన్నారు. ఈక్రమంలోనే నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన శ్రేణులు బలప్రదర్శనకు దిగాయి. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించాయి.

News April 4, 2025

పిల్లలకు SM నిషేధ అంశం పార్లమెంట్ పరిధిలోనిది: సుప్రీంకోర్టు

image

13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పాలసీ అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌నే కోరాలని సూచించింది. పిటిషనర్లు సంబంధిత విభాగానికి అర్జీ చేసుకుంటే 8 వారాల్లో పరిష్కరించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.

News April 4, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

ప్రముఖ మలయాళ నటుడు రవి కుమార్(71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాలు, అనేక సీరియళ్లలో నటించారు. ‘అనుబంధం’ సీరియల్‌తో పాటు రజినీకాంత్ శివాజీ మూవీలో మినిస్టర్ పాత్రతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

error: Content is protected !!