News March 17, 2024
పాకిస్థాన్‌కు చైనా నిఘా నౌక!
పాకిస్థాన్ నౌకాదళంలో తొలిసారిగా ఓ నిఘా నౌక చేరింది. భారత్‌పై కన్నేసి ఉంచేందుకు చైనా ఈ నౌకను అందించింది. అణు వార్‌హెడ్‌లు ఉన్న బాలిస్టిక్ క్షిపణుల్ని గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ నౌకను పాక్ ‘పీఎన్ఎస్ రిజ్వాన్’గా పిలుస్తోంది. చైనాలోని ఫుజియాన్ మావై షిప్ బిల్డింగ్ సంస్థ నిర్మించింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, భారత్ వద్ద మాత్రమే ఈ తరహా నిఘా నౌకలు ఉండగా పాక్ వాటి సరసన చేరింది.
Similar News
News October 16, 2024
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
TG: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జడ్జి అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో రేవంత్‌ను ఈడీ ఏ1 నిందితుడిగా పేర్కొంది. ఆయన రూ.50 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది.
News October 16, 2024
రేణిగుంట విమానాశ్రయంలో వరద.. విమానం చెన్నైకి మళ్లింపు
AP: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తున్న విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలతో రేణిగుంట విమానాశ్రయం రన్‌వే పైకి నీళ్లు చేరాయి. ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఆ విమానాన్ని చెన్నైకి మళ్లించారు.
News October 16, 2024
విజయం కోసం పేర్లు మార్చుకోవాల్సిందేనా?
సినీ ప్రముఖులు సైతం న్యూమరాలజీని ఫాలో అవుతుంటారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడం, స్టార్‌గా గుర్తింపు రాకపోవడం తదితర కారణాలతో పేర్లలో మార్పులు, చేర్పులు చేసుకున్న నటీనటులున్నారు. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్న విషయం తెలిసిందే. గతంలోనూ లక్ష్మీ రాయ్ – రాయ్ లక్ష్మీగా, కిచ్చా సుదీప్ – సుదీపగా, Sundeep Kishan – Sundeep Kishnగా పేరు మార్చుకున్నారు.