News September 22, 2025

US H-1Bకి పోటీగా చైనా ‘K వీసా’!

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించేందుకు చైనా కొత్తగా ‘K వీసా’ను ప్రవేశపెట్టింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ & మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో స్కిల్డ్ మ్యాన్‌ఫోర్స్ కోసం OCT 1 నుంచి ఈ వీసాను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నిపుణులు దీన్ని US H-1B వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు. వీసా ఫీజును US లక్ష డాలర్లకు పెంచడం చైనాకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Similar News

News September 22, 2025

సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
1987: సినీ నటుడు ఉన్నిముకుందన్ జననం(ఫొటోలో)
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం

News September 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 22, 2025

అమల్లోకి కొత్త జీఎస్టీ.. తగ్గిన ధరలు

image

దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40% లిస్టులో చేర్చారు. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాలతో పాటు సుమారుగా 200కు పైగా వస్తువుల ధరలు తగ్గాయి. ఇక దసరా సీజన్ కూడా మొదలవ్వడంతో కంపెనీలు మరింత ధరలు తగ్గించే అవకాశముంది. దీంతో షోరూమ్స్‌లో కొనుగోలుదారులతో సందడి నెలకొననుంది.