News May 11, 2024
భారత్‌లో మళ్లీ పుంజుకుంటున్న చైనా ఫోన్ల మార్కెట్!

2020లో చైనాతో సరిహద్దు వివాదం తర్వాత ఆదరణ కోల్పోయిన ఆ దేశ ఫోన్ బ్రాండ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. షియోమీ, ఓప్పో, వివో, రియల్‌మీ, ట్రాన్షన్, మోటరోలా మూకుమ్మడి మార్కెట్ షేర్ మార్చి నాటికి 75%కు చేరింది. రూ.25వేలు-50వేల రేంజ్ ఫోన్ల మార్కెట్ షేర్ 18%కు పెరిగింది. కానీ రెవెన్యూ షేర్‌లో చైనా కంపెనీలు వెనకబడ్డాయి. యాపిల్, శాంసంగ్ అందించే ప్రీమియం ఫోన్లపై దృష్టిసారించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Similar News
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
ఓటు లైట్ తీసుకున్నారా?

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.
News February 12, 2026
నేటి సామెత: కొబ్బరి చెట్లకు కుడితిమిత్తి

కొబ్బరి మొక్కకు వృథాగా పారబోసే కుడితిని నీరుగా పోసి పెంచితే, అది పెద్దయ్యాక మనకు ఎన్నో కాయలను అందించి ఆ రుణాన్ని తీర్చుకుంటుంది. చిన్నతనంలో మనం చేసిన చిన్న సహాయానికి లేదా పెట్టిన పెట్టుబడికి ఆ చెట్టు భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ ప్రతిఫలాన్ని మనకు తిరిగి అందిస్తుంది. అలాగే చిన్నప్పుడు పిల్లలకు మంచి సంస్కారం, విద్యను అందిస్తే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటారని ఈ సామెత చెబుతుంది.


