News August 24, 2024

రోదసిలో భారీగా పేరుకుపోతున్న చైనా ఉపగ్రహాల చెత్త

image

భూ కక్ష్యలోని క్రియాశీల ఉపగ్రహాలకు చైనా అంతరిక్ష ప్రయోగాలు పెను ముప్పుగా మారుతున్నాయి. ఈ నెల 6న ఆ దేశం ప్రయోగించిన లాంగ్ మార్చ్ 6ఏ రాకెట్ 300 ముక్కలై భూమి చుట్టూ తిరుగుతోంది. దశాబ్దాలపాటు ఇవి కక్ష్యలోనే ఉంటాయని అంచనా. భూకక్ష్యలో మిల్లీమీటర్ శకలాలు కూడా విధ్వంసాన్ని సృష్టించగలవు. ఆ దేశానికి చెందిన ఉపగ్రహాలు అనేకసార్లు ప్రపంచానికి ముప్పు తెచ్చేలా నియంత్రణ లేకుండా సముద్రాల్లో పడిన సంగతి తెలిసిందే.

Similar News

News October 25, 2025

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.

News October 25, 2025

వచ్చే నెల నుంచి అందుబాటులోకి ‘భారత్ టాక్సీ’

image

ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా కేంద్రం ‘భారత్ టాక్సీ’ని తీసుకురానుంది. వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి 25% చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఢిల్లీలో విజయవంతమైతే డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.

News October 25, 2025

నాగుల చవితి: పాములను ఎందుకు పూజిస్తారు?

image

దైవ స్వరూపంలో ప్రకృతి కూడా భాగమేనని మన ధర్మం బోధిస్తుంది. అందుకే ప్రకృతిలో భాగమైన పాములను కూడా మనం పూజిస్తాం. పురాణాల్లోనూ పాములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విష్ణుమూర్తి ఆదిశేషువుపై పవళించడం, శివుడు పాముని మెడలో ధరించడం, సముద్ర మథనంలో వాసుకిని కవ్వంగా ఉపయోగించడం వంటి కథలు వాటి దైవత్వాన్ని చాటి చెబుతాయి. నాగ దేవతలను ఆరాధించడం అంటే ప్రకృతి ధర్మాన్ని, జీవరాశిని గౌరవించడమే. అందుకే మనం పాములను పూజిస్తాం.