News August 24, 2024
రోదసిలో భారీగా పేరుకుపోతున్న చైనా ఉపగ్రహాల చెత్త
భూ కక్ష్యలోని క్రియాశీల ఉపగ్రహాలకు చైనా అంతరిక్ష ప్రయోగాలు పెను ముప్పుగా మారుతున్నాయి. ఈ నెల 6న ఆ దేశం ప్రయోగించిన లాంగ్ మార్చ్ 6ఏ రాకెట్ 300 ముక్కలై భూమి చుట్టూ తిరుగుతోంది. దశాబ్దాలపాటు ఇవి కక్ష్యలోనే ఉంటాయని అంచనా. భూకక్ష్యలో మిల్లీమీటర్ శకలాలు కూడా విధ్వంసాన్ని సృష్టించగలవు. ఆ దేశానికి చెందిన ఉపగ్రహాలు అనేకసార్లు ప్రపంచానికి ముప్పు తెచ్చేలా నియంత్రణ లేకుండా సముద్రాల్లో పడిన సంగతి తెలిసిందే.
Similar News
News September 12, 2024
చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ
కరోనా పుట్టిన చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విస్తరిస్తోంది. దీన్ని వెట్‌ల్యాండ్ వైరస్ అని పిలుస్తున్నారు. 2019లో దీన్ని తొలిసారి గుర్తించగా, ఇప్పుడు నెలలోనే 17 మందికి సోకింది. జంతువులలో రక్తాన్నీపీల్చే పురుగుల(ఓ రకమైన నల్లులు) ద్వారా మనుషుల్లో వ్యాపిస్తోంది. వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు కనిపిస్తాయని, తర్వాత మెదడు, నరాల సంబంధ వ్యాధులకు కారణమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
News September 12, 2024
చరిత్ర సృష్టించేందుకు 58 రన్స్ దూరంలో కోహ్లీ
క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్‌లో 26,952 పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 27వేల పరుగుల్ని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్(623 ఇన్నింగ్స్) పేరిట ఆ రికార్డు ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్, పాంటింగ్, సంగక్కర మాత్రమే 27వేలకు పైగా రన్స్ చేశారు.
News September 12, 2024
చంద్రబాబుతో కేంద్ర బృందాల భేటీ
ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలు సచివాలయంలో CM చంద్రబాబుతో భేటీ అయ్యాయి. వరద నష్టంపై తాము చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి CMకి వివరించాయి. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం కేంద్ర బృందాలను కోరారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందని చంద్రబాబు వివరించారు. కాగా రూ.6882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇప్పటికే కేంద్రానికి ప్రభుత్వం నివేదిక అందించింది.