News March 18, 2025
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్‌కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 15, 2025
కేంద్రానికి రూ.100 చెల్లిస్తే మనకి ఎంత తిరిగి వస్తుందంటే?

రాష్ట్రాలు పన్ను రూపంలో కేంద్రానికి చెల్లించే ప్రతి రూ.100లో తిరిగి ఎంత పొందుతాయో తెలుసా? అత్యల్పంగా మహారాష్ట్ర రూ.100 పన్నులో ₹6.8 మాత్రమే తిరిగి పొందుతోంది. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ ₹4278.8 తీసుకుంటుంది. ఆర్థిక సంఘం సూత్రాల ఆధారంగా జనాభా, ఆదాయ అసమానత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేస్తారు. TGకి ₹43.9, APకి ₹40.5 వస్తాయి. వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడటమే దీని ఉద్దేశ్యం.
News September 15, 2025
కలెక్టర్ల సదస్సుకు పవన్ దూరం.. కారణమిదే?

AP: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజలు ఉండటంతో రాలేదని ఆయన PR0 తెలిపారు. ఈ రోజునే ప్రారంభమైన పితృకర్మ పూజలో పవన్ పాల్గొంటున్నారని చెప్పారు. దీంతో రేపు కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.
News September 15, 2025
మరో వివాదంలో పూజా ఖేడ్కర్

మహారాష్ట్రకు చెందిన మాజీ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ విషయంలో ఆమె పేరు బయటికి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ తన ట్రక్‌తో ఓ కారును ఢీకొట్టారు. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగా పుణేలోని పూజా ఇంటిలో చూపించింది. డ్రైవర్‌ను విడిపిస్తున్న క్రమంలో పూజా తల్లి మనోరమ హంగామా చేశారు.