News March 18, 2025
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను మెగాస్టార్‌కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
Similar News
News April 22, 2025
BREAKING: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేశ్ బాబుకు ED నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ED సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేశ్ బాబు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది.
News April 22, 2025
డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పునర్విచారణ

AP: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పునర్విచారణకు కాకినాడ SP బిందు మాధవ్ ఆదేశించారు. విచారణ అధికారిగా IPS అధికారిని నియమించారు. 60 రోజుల్లో విచారణ నివేదిక అందజేయాలన్నారు. 2022 మే 19న YCP MLC అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం సంచలనమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చిందనే ఆరోపణలు వచ్చాయి.
News April 22, 2025
నేటితో ముగియనున్న సీఎం జపాన్ పర్యటన

TG: పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ హిరోషిమాకు వెళ్లి పీస్ మెమోరియల్‌ను రేవంత్ టీమ్ సందర్శించనుంది. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ ఛైర్మన్‌తో భేటీ కానుంది. మాజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు పయనం కానుంది.