News March 16, 2024
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిట్యాలలోని భువనగిరి రోడ్డులో ప్రమాదం జరిగింది. చిట్యాల ఎస్సై సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుదాటుతున్న రాములు అనే వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జగిత్యాలకు చెందిన వీరు కుమార్తె చికిత్స కోసం చిట్యాల వచ్చారు.
Similar News
News October 13, 2024
నాగర్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం 43,096 క్యూసెక్కుల ఇన్లో ఫ్లో వస్తుండగా అవుట్ ఫ్లో 54,096 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 307.2834 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు ఆదివారం సాయంత్రం తెలిపారు.
News October 13, 2024
మొదటి స్థానంలో నిలిచిన దేవరకొండ ఆర్టీసీ డిపో
దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి నడిపిన బస్సుల ద్వారా ఈనెల 11న ఒక్కరోజే దేవరకొండ డిపో రూ.35.86 లక్షలు ఆర్జించి, ఓఆర్‌లో 118.90 తో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించినట్లు డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు ఆదివారం తెలిపారు. మొత్తంగా 46 వేల 755 కిలోమీటర్లు నడిపి 51,750 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులకు డీఎం అభినందనలు తెలిపారు.
News October 13, 2024
తుంగతుర్తి: వేలంపాటలో దుర్గామాత చీరను దక్కించుకున్న ముస్లింలు
తుంగతుర్తి మండలం అన్నారు గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గమ్మ తల్లి చీర వేలం పాటలో ముస్లిం సోదరులు చీరను దక్కించుకున్నారు. ఈ మేరకు ఎండి.సిద్ధిక్ భాష, ఆజం అలీ పాల్గొని చీరను రూ.4100లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో చాలామంది పోటీపడి వేలం హోరాహోరీగా సాగింది. ఈ సంఘటన కులమత సామరస్యతకు ప్రత్యేకంగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.