News August 24, 2024
చాక్లెట్ మిల్క్ గోధుమ రంగు ఆవులు ఇస్తాయని అనుకుంటున్నారు!
అమెరికన్లలో చాలా మందికి తాము తీసుకునే ఆహారం ఎలా వస్తుందనే విషయం తెలియదని ఓ సర్వేలో తెలిసింది. U.S. డైరీకి సంబంధించిన ఇన్నోవేషన్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం 7 శాతం మంది అమెరికన్‌లు (23 మిలియన్ల మంది) చాక్లెట్ మిల్క్ గోధుమ రంగు ఆవుల నుంచి వస్తాయని నమ్ముతున్నారు. అమెరికన్లకు శాస్త్రీయ భావనలపై అవగాహన లేదని, సైన్స్ గురించి చాలా మందికి తెలియదని పరిశోధనలో వెల్లడైంది.
Similar News
News September 19, 2024
జమిలి ఎన్నికలపై పార్టీల స్టాండ్ ఏంటి?
జమిలి ఎన్నికలపై రాంనాథ్ కోవింద్ ప్యానెల్ 62 పార్టీల అభిప్రాయాలను కోరగా 47 పార్టీలే స్పందించాయి. అందులో 32 అనుకూలంగా, 15 పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. బీజేపీ, NPP, అన్నాడీఎంకే, అప్నాదళ్, అసోం గణ పరిషత్, బిజూ జనతాదళ్, శివసేన, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతిచ్చాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, సీపీఎం, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వ్యతిరేకించాయి. టీడీపీ, వైసీపీ, BRS స్పందించలేదు.
News September 19, 2024
దేశీయ స్టాక్ మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్
US ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఎనర్జీ, మోటార్, ఫైనాన్స్ రంగ షేర్లు లాభాలతో ఓపెన్ అయ్యాయి. ఐటీ, స్టీల్ రంగ షేర్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.
News September 19, 2024
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.