News January 2, 2025

శుభ్‌మన్ గిల్‌కు CID నోటీసులు

image

గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియాకు గుజరాత్ CID నోటీసులు అందించింది. పొంజి స్కీమ్‌లో జరిగిన రూ.450 కోట్ల అవకతవకలపై వీరికి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరందరిని CID అధికారులు ప్రశ్నిస్తారని సమాచారం. వీరందరూ ఈ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు నిర్థారించారు. గిల్ రూ.1.95 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు గుర్తించారు.

Similar News

News January 16, 2025

గిరిజన రైతులకు గుడ్ న్యూస్

image

TG: ‘ఇందిరమ్మ జలప్రభ స్కీమ్’లో భాగంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వనుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ కాస్ట్ ₹6Lగా నిర్ణయించింది. ఈ స్కీమ్‌ దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనుంది. కేంద్రం నుంచి 40% నిధులు రానున్నాయి.

News January 16, 2025

BREAKING: సైఫ్ అలీఖాన్‌పై దాడి

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

News January 16, 2025

Stock Markets: భారీ గ్యాప్‌అప్ ఓపెనింగ్‌కు ఛాన్స్!

image

స్టాక్‌మార్కెట్లు నేడు భారీ లాభాల్లో మొదలవ్వొచ్చు. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండటమే ఇందుకు కారణం. గిఫ్ట్‌నిఫ్టీ ఏకంగా 146 పాయింట్ల లాభంతో చలిస్తుండటం గమనార్హం. ఆసియా సూచీలన్నీ గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. నిన్న US, EU స్టాక్స్ అదరగొట్టాయి. US ఇన్‌ఫ్లేషన్ తగ్గిందన్న వార్తలు పాజిటివ్ సెంటిమెంటు నింపుతున్నాయి. డాలర్, ట్రెజరీ, బాండ్ యీల్డుల విలువలు కాస్త కూల్‌ఆఫ్ అయ్యాయి.