News March 18, 2025
విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

AP: కాకినాడ పోర్టు షేర్ల బదలాయింపు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ నెల 12న ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 18, 2025
ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్

పబ్జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో ప్రేమలో పడి పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన సీమా హైదర్ గుర్తుందా? ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఆమెకు నలుగురు పిల్లలుండగా ఇండియాకు వచ్చాక సచిన్ను మరోసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ గ్రేటర్ నోయిడాలో నివాసముంటున్నారు. కాగా, ఇవాళ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.
News March 18, 2025
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: గొట్టిపాటి

AP: YCP తప్పిదాలతో నిర్వీర్యమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొందరు విద్యుత్ ఉద్యోగులు ఆయన్ను కలవగా సానుకూలంగా స్పందించారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, అన్ని విషయాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వేళ విద్యుత్ శాఖ సేవలు వెలకట్టలేనివని ఆ శాఖ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా చెప్పారు.
News March 18, 2025
‘అర్జున్ రెడ్డి’ మూవీలో ఇప్పుడు నటిస్తారా? హీరోయిన్ స్పందనిదే

‘అర్జున్ రెడ్డి’లో తన పాత్ర బలహీనంగా ఉంటుందని షాలినీ పాండే అభిప్రాయపడ్డారు. అలాంటి మూవీలో ఇప్పుడు నటిస్తారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘కచ్చితంగా నటిస్తా. కానీ డైరెక్టర్తో కొన్ని మార్పులు చేయించుకుంటా. అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త కావడంతో అమాయకంగా ఉండేదాన్ని. ఇప్పుడు బలమైన క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు. ఇటీవల ఆమె ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్లో నటించారు.