News November 29, 2024
పీరియడ్స్ ఇబ్బందుల్ని తొలగించే దాల్చినచెక్క
పీరియడ్స్ టైమ్‌లో అసౌకర్యాన్ని తొలగించడంలో దాల్చినచెక్క ఎంతగానో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్టులు, వైద్యులు అంటున్నారు. ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌తో గర్భాశయ కండరాలు రిలాక్స్ అవుతాయి. రక్తనాళాలను సంకోచింపజేసి అధిక రక్తస్రావాన్నీ ఇది నివారించగలదు. వికారం, కడుపులో తిప్పడం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
Similar News
News November 29, 2024
‘ఆర్మీ’ని అవమానించారంటూ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు
తన ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ ‘ఆర్మీ’ అనే పదాన్ని వాడటాన్ని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు తప్పుబట్టారు. తనకూ ఓ ఆర్మీ ఉందంటూ దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆయన వ్యవహరించారని HYDలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్‌పై FIR నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
News November 29, 2024
గవర్నర్‌ను కలిసిన CM చంద్రబాబు
AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను CM చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో దాదాపు గంటపాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి.
News November 29, 2024
హైబ్రిడ్ మోడల్ తప్పదు.. పాక్‌కు తేల్చిచెప్పిన ఐసీసీ?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పాకిస్థాన్‌కు ICC ఈరోజు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. తొలుత అందుకు ససేమిరా అన్న పీసీబీ, రేపటి వరకు ఆలోచించుకునేందుకు సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే <<14743739>>మీటింగ్ రేపటికి వాయిదా పడిందని<<>> ఐసీసీ వర్గాలు తెలిపాయి. వేరే దారి లేని నేపథ్యంలో పీసీబీ ఒప్పుకోక తప్పదని పేర్కొన్నాయి.