News November 29, 2024
పీరియడ్స్ ఇబ్బందుల్ని తొలగించే దాల్చినచెక్క
పీరియడ్స్ టైమ్‌లో అసౌకర్యాన్ని తొలగించడంలో దాల్చినచెక్క ఎంతగానో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్టులు, వైద్యులు అంటున్నారు. ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌తో గర్భాశయ కండరాలు రిలాక్స్ అవుతాయి. రక్తనాళాలను సంకోచింపజేసి అధిక రక్తస్రావాన్నీ ఇది నివారించగలదు. వికారం, కడుపులో తిప్పడం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
Similar News
News December 6, 2024
PHOTOS: తల్లితో నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ తన తల్లి లక్ష్మీతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. నాగార్జునకు, మొదటి భార్య లక్ష్మీకి జన్మించిన కుమారుడే నాగచైతన్య. నిర్మాత డి.రామానాయుడు కూతురే లక్ష్మీ. ఆమె సోదరులు వెంకటేశ్, సురేశ్ బాబు.. చైతూకు మేనమామలు అవుతారు.
News December 6, 2024
S.K అధ్యక్షుడు యూన్‌కు అభిశంసన తప్పదా?
నియంతృత్వ పోకడలు ప్రదర్శించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తప్పేలా లేదు. దేశంలో సైనిక పాలన విధించిన యూన్ ప్రజాగ్రహానికి తలొగ్గిన విషయం తెలిసిందే. అయినా ఆయన్ను తప్పించేందుకు అధికార, విపక్షాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. యూన్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది. 2027 వరకు పదవీకాలం ఉన్నా అభిశంసన నెగ్గితే యూన్ తప్పుకోవాల్సిందే.
News December 6, 2024
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
TG: విద్యాసంస్థల్లో స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడంలేదు. ఇటీవల శ్రీచైతన్య, నారాయణ సంస్థల్లో పలువురు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ మేడ్చల్ సమీపంలోని MLRIT ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని శ్రావణి(18) ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఆమె ఉరేసుకుంది. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారంటూ శ్రావణి బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.