News December 3, 2024
ఆ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకున్న CJI

ECIలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్ల నియామక ప్రక్రియలో జ్యుడిషియరీని తప్పించే చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి CJI తప్పుకున్నారు. గతంలో ఈ కేసులను తాను విచారించినా, ప్రస్తుత పరిస్థితులు వేరవ్వడంతో మరో బెంచ్ విచారిస్తుందని CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. నియామక ప్రక్రియలో CJIని తప్పించి కేంద్ర మంత్రికి స్థానం కల్పిస్తూ కేంద్రం 2023లో చట్టం చేయడం వివాదమైంది.
Similar News
News November 21, 2025
ఆ రూ.360 కోట్లు ఇవ్వాలి: రోజా

మామిడి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని రోజా ఆరోపించారు. ‘చిత్తూరు జిల్లాలో 4.50లక్షల టన్నుల తోతాపురిని రైతులు ప్యాక్టరీలకు తోలారు. కిలోకు ప్రభుత్వం రూ.4, ప్యాక్టరీలు రూ.8 ఇస్తామని చెప్పారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం రూ.180కోట్లు ఇచ్చింది. ప్యాక్టరీలు రూ.8 కాకుండా రూ.4 చొప్పున ఇస్తున్నారు. ప్రభుత్వ మోసంతో రైతులు రూ.180 కోట్లు నష్టపోతారు. రూ.360 కోట్లు ఇచ్చేలా చూడాలి’ అని రోజా ట్వీట్ చేశారు.
News November 21, 2025
స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి.. రాజీనామా ప్రచారం?

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసుకు MLA కడియం శ్రీహరి స్పందించారు. గడువు(23)కు ముందే ఆయన్ను కలిసి వివరణకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై సభాపతి సానుకూలంగా స్పందించారు. మరోవైపు 2రోజుల్లో శ్రీహరి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వేడిలోనే స్టేషన్ ఘన్పూర్లోనూ బైపోల్కు వెళ్లి BRSను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు చర్చ జరుగుతోంది.
News November 21, 2025
పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. OCT 19 నుంచి NOV 19 మధ్య KG ధర సగటున ₹36 నుంచి ₹46కు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే కొన్నిచోట్ల KG రేటు ₹80కి చేరింది. కాగా APలోని అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్లో నిన్న గరిష్ఠంగా KG రేటు రూ.50 పలికింది.


