News December 3, 2024

ఆ పిటిష‌న్ల‌ విచార‌ణ నుంచి త‌ప్పుకున్న CJI

image

ECIలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, క‌మిష‌న‌ర్ల నియామ‌క ప్రక్రియలో జ్యుడిషియరీని త‌ప్పించే చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ విచార‌ణ నుంచి CJI త‌ప్పుకున్నారు. గతంలో ఈ కేసుల‌ను తాను విచారించినా, ప్ర‌స్తుత ప‌రిస్థితులు వేరవ్వ‌డంతో మరో బెంచ్ విచారిస్తుంద‌ని CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. నియామ‌క ప్రక్రియలో CJIని త‌ప్పించి కేంద్ర మంత్రికి స్థానం క‌ల్పిస్తూ కేంద్రం 2023లో చట్టం చేయడం వివాదమైంది.

Similar News

News July 9, 2025

ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. డేటా విశ్లేషణ కోసం FSLకు పంపించారు. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డును చేశారు. 2023 నవంబర్ 15-30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నంబర్లు, డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్‌లోని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. రేపు ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది.

News July 9, 2025

నెలకు రూ.1.23 లక్షల జీతం.. నోటిఫికేషన్ విడుదల

image

170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 21-25 ఏళ్ల వయసు ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్/12వ తరగతిలో కచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ చదవి ఉండాలి. చివరి తేదీ జులై 23. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.56,100 నుంచి రూ.1.23లక్షల వరకు ఉంది. https://joinindiancoastguard.cdac.in/

News July 9, 2025

యువీ ‘లక్ష్యం’ కోసం కదలిన తారలు

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఛారిటీ ‘YouWeCan’ కోసం క్రికెట్ సెలబ్రిటీలు తరలివచ్చారు. లండన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సచిన్ టెండూల్కర్, అజిత్ అగార్కర్, కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీతోపాటు టీమ్ ఇండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా క్యాన్సర్ రోగుల కోసం యువీ సామాజిక సేవ చేస్తున్న విషయం తెలిసిందే.