News November 12, 2024

అత్యవసర విచారణ ప్రక్రియలో కీలక మార్పు చేసిన CJI సంజీవ్ ఖన్నా

image

అత్యవసర కేసుల విచారణ విజ్ఞప్తులపై CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసుల లిస్టింగ్‌ను నోటిమాట ద్వారా విజ్ఞప్తి చేయడాన్ని నిషేధించారు. ‘ఇకపై నోటిమాట, రాతపూర్వకంగా ప్రస్తావించడం ఉండదు. ఈమెయిల్ లేదా ప్రత్యేకమైన స్లిప్‌పై రాసి ఇవ్వాలి. అలాగే అర్జంట్‌‌గా విచారణ చేపట్టేందుకు కారణాలు వివరించాలి’ అని ఆదేశించారు. మాజీ CJI చంద్రచూడ్ హయాంలో కొన్ని కేసులు ఓరల్ రిక్వెస్ట్‌తో స్వీకరించారు.

Similar News

News December 12, 2025

రోజూ 2 లీటర్లకు పైగా పాలు.. ఇదే ఈ మేక స్పెషల్

image

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి.

News December 12, 2025

అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం

image

AP: అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News December 12, 2025

నేడు అనఘాష్టమి వ్రతం ఆచరిస్తున్నారా?

image

మార్గశిర బహుళ అష్టమి అయిన నేడు అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దత్తాత్రేయుడి రూపమైన అనఘ స్వామిని, ఆయన అర్ధాంగి అనఘా దేవిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. అష్టసిద్ధులు గల సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు. ఈ పూజను రాముడు, ధర్మరాజు చేశారని నమ్మకం. అనఘాష్టమి పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.