News November 12, 2024
అత్యవసర విచారణ ప్రక్రియలో కీలక మార్పు చేసిన CJI సంజీవ్ ఖన్నా

అత్యవసర కేసుల విచారణ విజ్ఞప్తులపై CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసుల లిస్టింగ్‌ను నోటిమాట ద్వారా విజ్ఞప్తి చేయడాన్ని నిషేధించారు. ‘ఇకపై నోటిమాట, రాతపూర్వకంగా ప్రస్తావించడం ఉండదు. ఈమెయిల్ లేదా ప్రత్యేకమైన స్లిప్‌పై రాసి ఇవ్వాలి. అలాగే అర్జంట్‌గా విచారణ చేపట్టేందుకు కారణాలు వివరించాలి’ అని ఆదేశించారు. మాజీ CJI చంద్రచూడ్ హయాంలో కొన్ని కేసులు ఓరల్ రిక్వెస్ట్‌తో స్వీకరించారు.
Similar News
News March 17, 2026
రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

AP: రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్‌కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో APR 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.
News March 17, 2026
అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.
News March 17, 2026
విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


