News November 12, 2024
ఫస్ట్ డే 45 కేసులు విచారించిన CJI

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే జస్టిస్ సంజీవ్ ఖన్నా 45 కేసులు విచారించారు. ఆయన నిన్న రాష్ట్రపతి సమక్షంలో CJIగా ప్రమాణస్వీకారం చేశారు. హోదాతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానంగా చూడటం న్యాయవ్యవస్థ రాజ్యాంగపరమైన కర్తవ్యమని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ అందరికీ చేరాలంటే న్యాయప్రక్రియ మరింత సరళంగా ఉండాలన్నారు.
Similar News
News April 15, 2026
ముసలావిడే కానీ మహానుభావురాలు!

40ఏళ్లు దాటేసరికే జీవితం అయిపోయిందని చాలా మంది నిరుత్సాహపడుతున్న రోజులివి. కానీ కొత్త గమ్యాలకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ప్రభావతి భగవతి అనే 98ఏళ్ల బామ్మ. 2017లో భర్త చనిపోవడం, పిల్లలు దూరంగా ఉండటంతో ఒంటరితనాన్ని జయించేందుకు ఇతరుల ప్రోత్సాహంతో 2018లో ‘నానీస్ నాశ్తా’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 200కుపైగా కుటుంబాలకు గుజరాతీ, మహారాష్ట్ర వంటకాలను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
News April 15, 2026
CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు <<-1>>వెబ్‌సైట్‌లో<<>> రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 మధ్య ఎగ్జామ్స్ జరగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి. ఇక 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.