News August 11, 2025
డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత

AP: మెగా డీఎస్సీ-2025 ఫలితాలపై ఇవాళ లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశముంది. ఇటీవల ఫైనల్ కీ విడుదల కాగా.. అందులో తప్పులున్నాయని పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిపై విద్యాశాఖ అధికారులు నిపుణుల కమిటీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ నెల 25లోపు ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది.
Similar News
News August 11, 2025
భారత్‌లో టెస్లా రెండో షోరూమ్.. నేడే ప్రారంభం

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్‌లో రెండో షోరూమ్ ఓపెనింగ్‌కు సిద్ధమైంది. గత నెల 15న ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభించిన టెస్లా ఢిల్లీ ఎయిరోసిటీలో ఇవాళ 2PMకు రెండో స్టోర్ స్టార్ట్ చేయనుంది. షోరూమ్ ముందు <<17074330>>మోడల్ Y<<>> కార్లను ప్రదర్శించింది. V4 సూపర్‌ఛార్జింగ్ యూనిట్స్‌నూ అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా త్వరలో మరిన్ని సిటీలకు షోరూంలను విస్తరించే అవకాశముంది.
News August 11, 2025
సాయంత్రం భారీ వర్షాలు.. ఉద్యోగులకు కీలక సూచన

TG: హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ చేశారు. మ.3 గంటలకే దశలవారీగా లాగ్ ఔట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలని అన్ని కంపెనీలు, ఉద్యోగులకు సూచించారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సురక్షితంగా ఇళ్లకు చేరుకోవచ్చని, ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం ఉండదన్నారు. కొన్ని రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
News August 11, 2025
ఉమ్మడి కృష్ణాలో త్వరలో 2డిఫెన్స్ కేంద్రాలు

AP: ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 డిఫెన్స్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. నాగాయలంక గొల్లలమొద వద్ద మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం నెలకొల్పుతామని PM ప్రకటించడం తెలిసిందే. అటు బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం కోసం జగ్గయ్యపేట జయంతిపురం ప్రాంతాన్ని డిఫెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ NHకు దగ్గర్లో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో అనుకూలమని భావిస్తున్నారు. ఇవి పట్టాలెక్కితే వేల మందికి ఉపాధి లభిస్తుంది.