News August 27, 2024
వారికి రుణమాఫీపై నేడు స్పష్టత!

TG: రాష్ట్రంలో ₹2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి సమస్యల పరిష్కారానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు చర్చించనున్నారు. రుణమాఫీ యాప్‌లో వివరాల నమోదు, ఇతర అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. దీంతో పాటు రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీ ఎలా చేస్తారో వెల్లడించనున్నారు.
Similar News
News October 31, 2025
భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులతో రాణించారు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో అభిషేక్, హర్షిత్ రాణా (35) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. హేజిల్‌వుడ్ 4 ఓవర్లు వేసి కేవలం 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు. గిల్ (5), శాంసన్ (2), సూర్య (1), తిలక్ (0), అక్షర్ పటేల్ (7), శివమ్ దూబే (4) ఫెయిల్ అయ్యారు.
News October 31, 2025
భారత్‌లో టెస్లా, స్టార్‌లింక్ నియామకాలు

ఎలాన్ మస్క్‌కు చెందిన EV కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే ‘స్టార్‌లింక్’ భారత్‌లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించాయి. ముంబై, పుణే, ఢిల్లీ కేంద్రంగా పనిచేసేందుకు నిపుణుల కోసం టెస్లా ప్రకటన ఇచ్చింది. ఇందులో సప్లై చైన్, బిజినెస్ సపోర్ట్, AI, HR తదితర విభాగాలున్నాయి. అలాగే ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బెంగళూరులో పనిచేయాలని స్టార్‌లింక్ పేర్కొంది.
News October 31, 2025
సుశాంత్‌ను ఇద్దరు కలిసి చంపారు: సోదరి శ్వేతా సింగ్

2020లో జరిగిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై సోదరి శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి హత్య చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని US, ముంబైలోని ఇద్దరు సైకిక్స్ వేర్వేరుగా తనకు చెప్పారన్నారు. ‘సుశాంత్ బెడ్, ఫ్యాన్ మధ్య దూరాన్ని బట్టి అతను ఉరేసుకుని చనిపోయే అవకాశమే లేదు. మెడపై దుపట్టా మార్క్ కాకుండా ఒక చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించింది’ అని పేర్కొన్నారు.


