News March 14, 2025

ఏప్రిల్ 9 నుంచి 1-9వ తరగతి ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్‌మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.

Similar News

News March 14, 2025

పర పురుషులతో భార్య సెక్స్‌చాట్‌ను ఏ భర్తా భరించలేడు: హైకోర్టు

image

భార్య తన సెక్స్ లైఫ్ గురించి పరపురుషులతో చాటింగ్ చేస్తే ఏ భర్తా భరించలేడని MP హైకోర్టు తెలిపింది. ‘పెళ్లయ్యాక దంపతులు మొబైల్లో తమ మిత్రులతో అనేక అంశాలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఆ సంభాషణలు గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి అపోజిట్ జెండర్‌తోనైతే జీవిత భాగస్వామి గురించి అస్సలు అభ్యంతరకరంగా ఉండొద్దు’ అని పేర్కొంది. ఆ భార్య సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కుటుంబ కోర్టు మంజూరు చేసిన విడాకులను ఆమోదించింది.

News March 14, 2025

అయ్యో లక్ష్యసేన్: సెమీస్‌కు చేరకుండానే ఇంటికి..

image

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్‌ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.

News March 14, 2025

వలపు వలలో చిక్కి పాక్‌కు భారత రహస్యాలు.. వ్యక్తి అరెస్ట్

image

భారత రక్షణ రహస్యాల్ని పాక్ నిఘా సంస్థ ISIకి చేరవేస్తున్న రవీంద్ర అనే వ్యక్తిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. UPలోని ఫిరోజాబాద్‌లో ఆర్డినెన్స్ పరిశ్రమలో అతడు పనిచేస్తున్నాడు. నేహా శర్మ పేరుతో ISI విసిరిన వలపు వలలో చిక్కుకుని కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడని అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాల్ని అతడి ఫోన్ నుంచి రికవర్ చేశామని, అతడి సహాయకుడినీ అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

error: Content is protected !!