News October 15, 2024

ఈనెల 22న తరగతులను బహిష్కరించాలి: ఆర్.కృష్ణయ్య

image

TG: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈనెల 22న తరగతులను బహిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్‌షిప్ రూ.5,500 నుంచి రూ.10వేలకు పెంచాలనే డిమాండ్‌తో కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులను ముట్టడించాలని ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ కాలేజీలను నిరవధికంగా బంద్ చేయాలనే నిర్ణయాన్ని యాజమాన్యాలు ఉపసంహరించుకోవాలని కోరారు.

Similar News

News November 9, 2024

2024 US Results Final: ఆ రెండూ ట్రంప్ ఖాతాలోకే

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డిలో ఆల‌స్య‌మైన ఆరిజోనా, నెవాడాలను కూడా రిప‌బ్లిక‌న్ పార్టీ గెలుచుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇప్ప‌టికే 295 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌తో విజ‌యదుందుబి మోగించిన ట్రంప్ ఆరిజోనా(11), నెవాడా(6)లోనూ గెలుపొందారు. దీంతో రిప‌బ్లిక‌న్లు మొత్తంగా 312 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్నారు. డెమోక్రాట్లు 226 ఓట్లకు పరిమితమయ్యారు. 2016లో సాధించిన 304 ఓట్ల మెజారిటీని ట్రంప్ అధిగమించారు.

News November 9, 2024

వాట్సాప్ ద్వారా ఈ నెలాఖ‌రుకు 100 సేవ‌లు: మంత్రి లోకేశ్

image

AP: ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వ‌న‌రుగా ఉండాల‌ని CM చంద్రబాబు అన్నారు. RTGపై సమీక్షించిన ఆయన, ప్రజ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అందుబాటులోకి తేవాల‌న్నారు. వాట్సాప్ ద్వారా ఈ నెలాఖ‌రుకు 100 సేవ‌లు అందుబాటులోకి తేవ‌డానికి కృషి చేస్తున్నట్లు CMకు మంత్రి లోకేశ్ వివరించారు. 90 రోజుల్లో QR కోడ్ ద్వారా విద్యార్హత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు పొందేలా చ‌ర్యలు చేప‌డుతున్నామ‌న్నారు.

News November 8, 2024

SAvsIND: ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. స్కోరు ఎంతంటే..

image

డర్బన్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. భారత్ 8 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. శాంసన్ 107 రన్స్, తిలక్ 33 పరుగులతో రాణించారు. 15 ఓవర్ల సమయానికి భారత్ కనీసం 220 పరుగులు చేసేలా కనిపించినా.. శాంసన్ ఔటయ్యాక మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో 202 రన్స్‌తోనే సరిపెట్టుకుంది. సఫారీ బౌలర్లలో కొయెట్జీ 3 వికెట్లు, జాన్సెన్, మహరాజ్, పీటర్, క్రూగర్ తలో వికెట్ తీశారు.