News March 17, 2024
మ 3గం.లోపు అన్ని క్లియర్ చేయండి: నంద్యాల జిల్లా కలెక్టర్
నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వేళ ఈ మ.3 గం.లోపు సచివాలయాలు, RBKలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజా ప్రతినిధుల చిత్రపటాలను తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలన్నారు.
Similar News
News October 16, 2024
నంద్యాల జిల్లాలో నేడు సెలవు
నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశామని అన్నారు. కాగా కర్నూలు జిల్లాలో సెలవు ప్రకటించలేదు.
News October 16, 2024
నంద్యాల జిల్లాలో సెలవు ఇవ్వాలని డిమాండ్
అల్పపీడన ప్రభావంతో నంద్యాల జిల్లాలో జోరు వాన పడుతోంది. మహానంది, రుద్రవరం, ఆళ్లగడ్డ, కొలిమిగుండ్ల, నంద్యాల, అవుకు తదితర మండలాల్లో నిన్నటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు నేడు, రేపు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలపడంతో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముసురు వాతావరణం నెలకొనడంతో బయటకు వచ్చే పరిస్థితిలేదని సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
News October 16, 2024
కర్నూలు: అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక
అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళికను రూపొందించాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర@ 2047 జిల్లా ప్రణాళిక రూపకల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్, హార్టికల్చర్ అభివృద్ధి, వ్యవసాయం, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.