News September 4, 2024

నాగార్జున సాగర్ గేట్లు మూసివేత

image

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,98,937 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 586 అడుగులుగా ఉంది. అంతకుముందు శ్రీశైలం గేట్లు మూసివేసిన సంగతి తెలిసిందే.

Similar News

News September 17, 2024

‘బిగ్ బాస్’ ఫేమ్ సోహెల్‌ తల్లి కన్నుమూత

image

‘బిగ్ బాస్’ ఫేమ్, సినీ నటుడు సోహెల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆయన తల్లి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోహెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి. దీంతో ఆమె పార్థీవదేహాన్ని స్వస్థలానికి తరలించారు. ‘కొత్త బంగారు లోకం’తో సోహెల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు.

News September 17, 2024

త్రివిక్రమ్‌ను ప్రశ్నించండి: పూనమ్

image

జానీ మాస్టర్‌పై రేప్ కేసు నమోదవడంతో ఇండస్ట్రీలోని పలువురు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ తాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై గతంలో ‘మా’కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ‘అప్పుడే అతడిపై “మా” చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది బాధపడేవారు కాదు. త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

News September 17, 2024

Stock Market: ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్తప‌డ్డారు

image

US ఫెడ్ వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు ఊహాగానాల నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డ్డారు. సెన్సెక్స్ రోజంతా 82,866 – 83,153 మధ్య క‌న్సాలిడేట్ అవుతూ చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 25,418 వ‌ద్ద నిలిచింది. హీరో మోటార్స్‌, బ‌జాజ్ ఆటో, Airtel టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఐచర్, టాటా స్టీల్, కోల్ ఇండియా, JSW Steel టాప్ లూజర్స్.