News February 6, 2025
బీసీ, ఎస్సీ వర్గీకరణలపై 2 సభలకు సీఎల్పీ నిర్ణయం

TG: CLP భేటీలో CM రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. BC కులగణన, SC వర్గీకరణలపై 2 సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. SC వర్గీకరణపై నల్గొండలో, BC వర్గీకరణపై ఉత్తర తెలంగాణలో సభలకు ప్లాన్ చేశారు. వీటికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. అటు వీటిపై గ్రామ, మండల, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.
Similar News
News March 27, 2025
ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.
News March 27, 2025
హీట్ వేవ్.. వారికి కిడ్నీ సమస్యలు!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతకు గురవుతుంటే కష్టజీవులు మండుటెండలో చెమటోడుస్తున్నారు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి మూత్ర పిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో 60శాతం గ్రామీణులే ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. రైతులు, రోడ్డు& భవన నిర్మాణ కార్మికులు, ట్రక్ డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు.
News March 27, 2025
సంపాదనలో రష్మిక మందన్న టాప్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.