News April 15, 2025
సీఎల్పీ భేటీ ప్రారంభం

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సీఎల్పీ మీటింగ్ ప్రారంభం అయింది. డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై చర్చిస్తున్నారు. భూభారతి, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలకు అవగాహన కల్పించడంపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌కు వివేక్, రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్ గైర్హాజరయ్యారు.
Similar News
News April 20, 2025
రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాల్లో <
News April 20, 2025
తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: సీఎం చంద్రబాబు

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ CM చంద్రబాబు ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.
News April 20, 2025
ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.