News September 22, 2024
సీఎం అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. హాజరైన అరికెపూడి

TG: పథకాల అమలు, పార్టీ వ్యవహారాలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం మొదలైంది. మాదాపూర్‌లోని హోటల్లో జరగుతున్న ఈ భేటీకి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల బీఆర్ఎస్లోనే ఉన్నట్లు ప్రకటించిన అరికెపూడి గాంధీ ఈ సమావేశానికి హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News January 23, 2026
నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో ఉద్యోగాలు

<
News January 23, 2026
ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: CBN

AP: వ్యవసాయంతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలకూ అధిక రుణాలివ్వాలని CM CBN బ్యాంకర్ల సమావేశంలో సూచించారు. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయని చెప్పారు. ‘అమరావతిని ఆర్థిక సంస్థల కేంద్రంగా మారుస్తున్నాం. 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. డ్వాక్రా సంఘాల ఖాతాలపై వేస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ను ప్రోత్సహించాలి’ అని పేర్కొన్నారు.
News January 23, 2026
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 769.67 పాయింట్లు క్షీణించి 81,537.70 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 241.25 పాయింట్లు పడిపోయి 25,048.65కు దిగజారింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (Indigo), సిప్లా వంటి షేర్లు భారీగా నష్ట పోయాయి. డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, ONGC వంటివి కొంత మేర లాభాల్లో నిలిచాయి.


