News September 22, 2024

సీఎం అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. హాజరైన అరికెపూడి

image

TG: పథకాల అమలు, పార్టీ వ్యవహారాలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం మొదలైంది. మాదాపూర్‌లోని హోటల్‌లో జరగుతున్న ఈ భేటీకి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు ప్రకటించిన అరికెపూడి గాంధీ ఈ సమావేశానికి హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News July 6, 2025

టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

image

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.

News July 6, 2025

తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

image

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.

News July 6, 2025

ప్రపంచస్థాయి కెమికల్ హబ్స్ రావాలి: నీతిఆయోగ్

image

ప్రపంచస్థాయి కెమికల్స్ హబ్స్ స్థాపనపై కేంద్రం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది. ‘అత్యధిక సామర్థ్యాలుండే 8 పోర్ట్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌నూ స్థాపించాలి. 2040నాటికి భారత్ లక్షకోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో గ్లోబల్ వ్యాల్యూ చెయిన్‌లో 3.5%గా ఉన్న వాటా 2040నాటికి 4-5శాతానికి పెరగనుంది. 2030నాటికి 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది’ అని నివేదికలో వివరించింది.