News April 14, 2025

రేపు CLP సమావేశం.. 4 అంశాలపై చర్చ

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం రేపు సమావేశం కానుంది. శంషాబాద్ నోవాటెల్‌లో ఉ.11 గంటల నుంచి జరగనున్న ఈ భేటీలో 4 అంశాలపై చర్చించనున్నారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, SC-ST వర్గీకరణపై చర్చ జరగనుంది. ఈ మేరకు పార్టీ MLAలు, MLCలకు ప్రభుత్వ విప్‌లు సమాచారం ఇచ్చారు.

Similar News

News April 23, 2025

డీఈఈ సెట్ దరఖాస్తులు ప్రారంభం

image

AP: రెండేళ్ల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. జూన్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహించి అదే నెల 10న అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: <>https://apdeecet.apcfss.in/<<>>

News April 23, 2025

ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

image

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.

News April 23, 2025

ఇవాళ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు

image

ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ జమ్మూకశ్మీర్‌లో బంద్‌కు JKHC, CCIK, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్లో క్యాండిల్‌లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి.

error: Content is protected !!