News December 31, 2024

న్యూ ఇయర్ వేడుకలకు సీఎం, మంత్రులు దూరం

image

TG: న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలు, స్వీట్ బాక్సులు, శాలువాలు తీసుకురావద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆదేశాలు జారీ చేశారు. మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 25, 2025

ముంబై దాడులు: రాణా అప్పగింతకు US సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

image

2008 ముంబై దాడుల కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అతడి అప్పగింతపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను తాజాగా కొట్టేసింది. దీంతో నేరగాళ్ల ఒప్పందం ప్రకారం త్వరలోనే అమెరికా రాణాను భారత్‌కు సరెండర్ చేయనుంది. పాకిస్థాన్ ISI, లష్కరే తోయిబాతో సంబంధాలున్న అతడే ముంబై పేలుళ్ల సూత్రధారి అని గతంలో IND ఆధారాలు సమర్పించింది.

News January 25, 2025

నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!

image

మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’కి మలయాళంలో పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం తెలుగులోనూ రిలీజైంది. తాజాగా ఈ మూవీ OTT రైట్స్ దక్కించుకున్న జీ5 జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే థియేటర్లలో రిలీజైన వారానికే OTTలోకి వస్తుండటం గమనార్హం. మూవీలో టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో ఇప్పటి వరకు రూ.18కోట్లకు పైగా వసూలు చేసింది.

News January 25, 2025

దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై మంత్రి క్లారిటీ

image

AP: అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతినెలా దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచంలో ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందజేస్తోన్న విషయం తెలిసిందే.