News December 4, 2024
KCRపై కోపంతో CM అలా చేస్తున్నారు: KTR
TG: KCRపై కోపంతో CM రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చుతున్నారని KTR అన్నారు. ‘మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని KCR ఏర్పాటు చేయించారు. దానిని మార్చవద్దని CMకి చెబుతున్నా. ఇందిరా గాంధీ పెట్టిన భరత మాత విగ్రహాన్ని వాజపేయీ మార్చలేదు. రేవంత్ ఆటలు ఎల్లకాలం సాగవు. రాజీవ్ విగ్రహం ఉన్న చోటే భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News January 20, 2025
కల్తీ/నకిలీ పనీర్‌ను ఇలా తెలుసుకోండి..
నాన్‌వెజ్‌కు ప్రత్యామ్నాయంగా వాడే పనీర్‌లో నకిలీ/కల్తీ పెరిగాయి. దానిని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. డ్రై పాన్‌పై చిన్న పీస్‌ను వేడి చేయండి. ఒరిజినలైతే కలర్ బ్రౌన్‌గా మారి ముక్క కొంత పొడిపొడిగా అవుతుంది. ఉడికించిన పనీర్‌ను చల్లారబెట్టి ఆ నీటిలో అయోడిన్ చుక్కలు వేయండి. స్టార్చ్ ఉంటే నీరు నీలంగా మారుతుంది. ఇక కందిపొడి వేస్తే పనీర్ రెడ్‌గా మారిందంటే యూరియా, సర్ఫ్ వంటి కెమికల్స్ ఉన్నట్టే.
News January 20, 2025
చంద్రబాబు హయాంలో ఒక్క అప్పడాల మెషిన్ కూడా రాలేదు: YCP
చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ దావోస్ వెళ్లి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఇన్నేళ్లలో ఒక్క అటుకుల మిల్లు, అప్పడాల మెషిన్ కూడా రాలేదు. తండ్రీకొడుకులు ప్రజా ధనంతో షికార్లు చేసి వస్తారు. జగన్ తన హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి’ అని ట్వీట్ చేసింది.
News January 20, 2025
బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా
రేపు నల్గొండలో BRS చేపట్టాల్సిన మహాధర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని చెప్పిన హైకోర్టు, విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈనెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదన్నారు.