News February 22, 2025
కులగణనపై నేడు సీఎం అధ్వర్యంలో భేటీ

TG: కులగణనపై నేడు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు. కులగణనలో వివరాల నమోదుపై అవగాహన కల్పించడంపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై తీర్మానం చేసే అంశాన్ని ప్రచారం చేయాలని సూచించనున్నట్లు సమాచారం.
Similar News
News March 15, 2025
ముస్లింలకే 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు?: DK శివకుమార్

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు ముస్లింలకే కేటాయించిందని కర్ణాటక సర్కారును ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ ఆ రాష్ట్ర Dy.CM డీకే శివ కుమార్ స్పందించారు. ‘కేవలం ముస్లింలకు 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు. వెనకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు అంటే ముస్లింలే కాదు. అందులో క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు, మొదలైన వారు ఉంటారు’ అని క్లారిటీ ఇచ్చారు.
News March 15, 2025
ఎముకలు దృఢంగా ఉండాలంటే…

మన ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం.. కాల్షియంతో పాటు డీ, కే విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అలాగే మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా కొంత మోతాదులో అవసరమే. అంజీర్, సముద్రపు చేపలు, బాదంపప్పులో ఇవన్నీ లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
News March 15, 2025
సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్‌తో 365 రోజులు..

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్‌గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.