News June 20, 2024
సతీమణికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్
AP: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవకు అంకితమైన నాకు ఎల్లవేళలా అండగా నిలిచావు. కష్ట సమయాల్లోనూ చిరునవ్వు చెదరకుండా ధైర్యంగా నాకు తోడుగా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే భువనేశ్వరి. నా సర్వస్వం’ అని పోస్ట్ చేశారు.
Similar News
News September 11, 2024
విశాఖకు మరో వందేభారత్
విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా SEP 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్(ఛత్తీస్‌గఢ్)కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉ.6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి రాయ్‌పూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా మ.1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.55 గం.కు బయల్దేరి రా.10.50 గం.కు దుర్గ్ చేరుకుంటుంది.
News September 11, 2024
సీఎం రేవంత్ సొంత గ్రామంలో సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు
TG: సీఎం రేవంత్ సొంత గ్రామం నాగర్ కర్నూల్(D) కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని TGSPDCL CMD వెల్లడించారు. కొండారెడ్డిపల్లిలో సర్వే చేశామని, త్వరలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్లు పంపిణీ చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ప్రతి పల్లెలో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు.
News September 11, 2024
ఆన్‌లైన్‌లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నారా?
డబ్బులు చెల్లించి OTTలో కాకుండా వివిధ అక్రమ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లను డౌన్‌లోడ్ చేసుకుని చూడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటు ప్రేక్షకులు, అటు పైరసీ చేసేవారు పన్ను ఎగవేస్తుండటంతో భారత్ భారీగా ఆదాయం కోల్పోతోంది. అంతేకాదు యూజర్ల వ్యక్తిగత డేటాను డార్క్ వెబ్‌కు అమ్మేస్తున్నట్లు తేలింది. ఆ ఆదాయాన్ని మానవ, ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు.