News August 18, 2024
రేపు తిరుపతి జిల్లాకు సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు రేపు తిరుపతి జిల్లా శ్రీసిటీకి రానున్నారు. 15 సంస్థలను ప్రారంభించి, మరో 7 సంస్థల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ₹900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరో ₹1,213కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. పలు కంపెనీల CEOలతో భేటీ అనంతరం నెల్లూరు(D) సోమశిల సాగునీటి ప్రాజెక్టును CM సందర్శిస్తారు.
Similar News
News November 29, 2025
నేడు బ్రేక్‌ఫాస్ట్ మీట్.. వివాదానికి తెర పడనుందా?

కర్ణాటకలో ‘సీఎం కుర్చీ’ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. CM సిద్దరామయ్య, Dy.CM DK శివకుమార్‌లకు ఇవాళ 9.30AMకు బ్రేక్‌ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ భేటీతో ‘సీఎం’ వివాదానికి తెరదించాలని భావిస్తోంది. కాగా 2023 ఎన్నికల సమయంలో అధిష్ఠానం ఇచ్చిన సీఎం హామీని నెరవేర్చాలని DK అనుచర వర్గం కోరుతోంది. అటు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సిద్దరామయ్య చెప్పారు.
News November 29, 2025
రోహిత్ శర్మ ముంగిట అరుదైన రికార్డులు

SAతో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. 3 సిక్సులు బాదితే ODI ఫార్మాట్లో లీడింగ్ సిక్స్ హిట్టర్‌గా నిలుస్తారు. అలాగే 98 రన్స్ చేస్తే 20వేల అంతర్జాతీయ పరుగులు పూర్తవుతాయి. 213 రన్స్ కొడితే 16వేల పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్‌గా అవతరిస్తారు. ఓ సెంచరీ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డ్ సృష్టిస్తారు. SAతో 3 వన్డేల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
News November 29, 2025
ChatGPTలో ఇది ఎప్పుడైనా గమనించారా?

అడ్వాన్స్‌డ్ AI టూల్ అయిన ChatGPT టైమ్ చెప్పలేకపోవడం చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణంగా ChatGPTకి సిస్టమ్ టైమ్‌కు నేరుగా యాక్సెస్ ఉండకపోవడం. రియల్‌టైమ్ డేటా చేర్చడానికి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండటంతో పాటు AI గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే Gemini, Copilot, Grok వంటి AI టూల్స్ మాత్రం ఆటోమేటిక్‌గా టైమ్ చెప్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు OpenAI పనిచేస్తోంది.


