News August 18, 2024

రేపు తిరుపతి జిల్లాకు సీఎం చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు రేపు తిరుపతి జిల్లా శ్రీసిటీకి రానున్నారు. 15 సంస్థలను ప్రారంభించి, మరో 7 సంస్థల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ₹900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరో ₹1,213కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. పలు కంపెనీల CEOలతో భేటీ అనంతరం నెల్లూరు(D) సోమశిల సాగునీటి ప్రాజెక్టును CM సందర్శిస్తారు.

Similar News

News September 12, 2024

మెటా ఏఐకి పబ్లిక్ ఫిగర్ల వాయిస్!

image

వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌కు త్వరలో <<13848701>>వాయిస్ వెర్షన్<<>> రానుంది. దీనిని డిఫరెంట్ వాయిస్‌లలో అందుబాటులోకి తేనున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. మొదటగా ఇంగ్లిష్‌లో పలువురు ప్రజాదరణ పొందిన వ్యక్తుల గొంతులతో తీసుకురానున్నారని, భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తారని తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన వాయిస్‌ను ఎంచుకుని వాడుకోవచ్చని వివరించింది.

News September 12, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

image

AP: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాట లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

News September 12, 2024

వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు: గంటా శ్రీనివాస్

image

AP: వరద బాధితుల్ని ఆదుకోకుండా జైలులో ఉన్న పార్టీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారని MLA గంటా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ‘బాధితులకు GOVT అందిస్తున్న సాయంపై ఆరోపణలు చేస్తే చరిత్రహీనులుగా మారుతారు. ఎన్నికల్లో YCPని ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌లో మార్పు రాలేదు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారు. కూటమి సర్కార్ గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారు’ అని అన్నారు.