News August 28, 2024
ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి!

AP: ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల ఇన్నాళ్లుగా సంపాదించుకున్న మంచి పేరు దెబ్బతింటోంది. వారు చేసిన పొరపాట్ల గురించి వార్తలొస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోంది. మంత్రులు తమ తమ జిల్లాల్లోని నాయకులకు దిశానిర్దేశం చేయాలి. ఇలాంటివి జరగకుండా చూడాలి’ అని సూచించారు.
Similar News
News December 28, 2025
UGC-NET అడ్మిట్ కార్డులు విడుదల

డిసెంబర్ సెషన్‌కు సంబంధించి UGC-NET అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. NETకు అప్లై చేసుకున్న వారు https://ugcnet.nta.nic.in/లో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టులకు సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 31, జనవరి 2, 3, 5, 6, 7తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. NET అర్హత సాధించడం ద్వారా JRF, డిగ్రీ, పీజీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించవచ్చు.
News December 28, 2025
అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బందిచే తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల కాంగ్రెస్ MP వంశీకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ <
News December 28, 2025
పాపులెవరు? ఎలాంటి వారికి నరకంలో శిక్ష పడుతుంది?

వేదశాస్త్రాలను నిందించేవారు, గోహత్య, బ్రహ్మహత్య చేసేవారు కఠిన శిక్షార్హులు. పరస్త్రీలను ఆశించేవారు, తల్లిదండ్రులను, గురువులను హింసించేవారు, దొంగతనాలు చేసేవారిని పాపాత్ములుగా పరిగణిస్తారు. శిశుహత్య, శరణు కోరిన వారిని బాధించడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను అపడం వల్ల కూడా నరకానికి పోతారట. ఈ దుశ్చర్యలు చేసే వారిని మరణానంతరం యమలోకానికి తీసుకెళ్లి, యముడి ఆజ్ఞ మేరకు నరకంలో కఠినంగా శిక్షిస్తారని నమ్మకం.


