News August 28, 2024
ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి!
AP: ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల ఇన్నాళ్లుగా సంపాదించుకున్న మంచి పేరు దెబ్బతింటోంది. వారు చేసిన పొరపాట్ల గురించి వార్తలొస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోంది. మంత్రులు తమ తమ జిల్లాల్లోని నాయకులకు దిశానిర్దేశం చేయాలి. ఇలాంటివి జరగకుండా చూడాలి’ అని సూచించారు.
Similar News
News September 13, 2024
ALERT.. మళ్లీ వర్షాలు
AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
News September 13, 2024
ఈ నెల 21న మోదీ-బైడెన్ భేటీ
ఈ నెల 21న క్వాడ్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో కూడా పాల్గొంటారని పేర్కొంది. నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్‌లో జరిగే ఈ సదస్సులో క్వాడ్ ప్రాముఖ్యత, ఆరోగ్య భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రకృతి వైపరీత్యాలపై స్పందన, సముద్ర భద్రత వంటి విషయాలపై చర్చించనున్నారు.
News September 13, 2024
పవర్‌ప్లేలో ‘హెడ్’ మాస్టరే..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ఈ ఏడాది పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 192.32 స్ట్రైక్ రేట్‌తో 1,027 పరుగులు బాదారు. అతడి తర్వాత ఫిల్ సాల్ట్ (827), డుప్లెసిస్ (807), అలెక్స్ హేల్స్ (792), జేమ్స్ విన్స్ (703) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఏడాది హెడ్ 181.36 స్ట్రైక్ రేట్‌తో 1,411 రన్స్ సాధించారు.