News August 2, 2024
మద్యంపై CM చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తామని CM వెల్లడించారు.
Similar News
News December 2, 2025
రేపటి నుంచి సింహాచలం నృసింహ దీక్షలు ప్రారంభం

సింహాచలంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి నృసింహ దీక్షలు ప్రారంభం కానున్నట్లు ఈవో సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ దీక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత దీక్షలు డిసెంబర్ 3 నుంచి, రెండో విడత దీక్షలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పై తేదీలలో మాల ధరించే భక్తులకు తులసి మాలలు, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.

రాజ్ భవన్ ఇకపై ‘లోక్ భవన్’

గవర్నర్ అధికారిక నివాస, కార్యాలయ భవనం రాజ్ భవన్ పేరు మారింది. ‘లోక్ భవన్’గా మారుస్తూ గత నెల 25న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై దేశంలోని రాజ్ భవన్‌లను లోక్ భవన్‌గా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరు మార్చగా తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చనున్నారు. కాగా దీనిపై రెండేళ్ల క్రితమే గవర్నర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.