News July 9, 2024
బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు భేటీ
AP: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలతో పాటు గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Similar News
News October 4, 2024
ఒక్క ఫోన్ కాల్.. ఆగిన మహిళ గుండె!
డబ్బు కోసం తెలివిమీరిన మోసగాడు చేసిన పనికి ఓ మహిళ గుండె ఆగింది. ఆగ్రాకు చెందిన ప్రభుత్వ టీచర్ మాల్తీ వర్మకు ఆగంతకుడి నుంచి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చింది. పోలీస్ ఫోటో డీపీగా పెట్టిన దుండగుడు ‘నీ కూతురు సెక్స్ రాకెట్‌లో దొరికింది’ అని మాల్తీకి చెప్పాడు. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తానన్నాడు. కూతురి గురించి అలాంటి వార్త వినడంతో తీవ్ర ఆందోళనకు గురై ఆమె గుండెపోటుతో మరణించింది. దీనిపై కేసు నమోదైంది.
News October 4, 2024
సోదరి నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు: CM రేవంత్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్నిచ్చింది. తాజాగా ఆమెకు రేవంత్ లాఠీని బహూకరించారు. ‘పేదరికాన్ని జయించి, సమానత్వాన్ని సాధించి, విశ్వక్రీడా వేదికపై తెలంగాణ కీర్తి పతాకను ఎగరేసి, నేడు ప్రజా ప్రభుత్వంలో డీఎస్పీగా నియమితులైన సోదరి నిఖత్ జరీన్‌కు హార్దిక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
News October 4, 2024
గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ALERT
AP: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు, టీచర్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. <