News December 29, 2024
సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన ఖరారు

AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
Similar News
News January 17, 2026
నల్గొండ తొలి మేయర్‌గా ‘ఆమె’

నల్గొండ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారైంది. ప్రభుత్వం ఈ పదవిని ‘జనరల్ మహిళ’కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 17, 2026
రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.
News January 17, 2026
ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It


