News December 25, 2024
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ
AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. తొలుత మాజీ PM వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం BJP జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే NDA నేతల సమావేశానికి హాజరవుతారు. జమిలి, వక్ఫ్ బిల్లులపై చర్చిస్తారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.
Similar News
News January 22, 2025
రేషన్ కార్డుల అంశంపై ప్రభుత్వం అప్రమత్తం
TG: రేషన్ కార్డుల జారీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామ సభల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు కావాలనే గొడవ చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందుతాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
News January 22, 2025
అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే ఫిఫ్టీ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50*) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆయన అర్ధ శతకం చేశారు. ఆదిల్ రషీద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 93/2గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి ఇంకా 40 పరుగులు కావాల్సి ఉంది.
News January 22, 2025
మహా కుంభమేళాలో ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రదర్శన
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను ప్రదర్శించనున్నారు. సెక్టార్ 6లోని దివ్య ప్రేమ్ సేవా శిభిరంలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. తాజాగా విడుదలైన 4K వెర్షన్‌ను చూసేందుకు పాఠశాల పిల్లలు, భక్తులను ఆహ్వానిస్తున్నారు.